పులివెందులలో పురాతన క్షేత్రమైన శ్రీ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కృష్ణరాజేష్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ రంగనాథ స్వామి సూర్య, చంద్ర వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ఆలయ చైర్మన్ సుధీకర్ రెడ్డి అంకురార్పణ చేసి స్వామివారి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు.
![]() |
![]() |