మద్యం విషయంలో తనపై సీఎం రమేష్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మంగళవారం లోక్‌సభలో అన్నారు. సీఎం రమేష్‌కు కాంట్రాక్టులు కావాలంటే చంద్రబాబు దగ్గరికి వెళ్లి మాట్లాడుకోవాలని ఎద్దేవా చేశారు. కుంభకోణాన్ని బయటపెట్టినందుకే తమపై సీఎం రమేష్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మార్గదర్శి కుంభకోణం అతిపెద్ద స్కామ్ అని, ఈ స్కామ్‌పై విచారణ జరగాల్సిందేనని మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. రాష్ట్ర ప్రయోజనాలపై టీడీపీ ఎంపీలు మాట్లాడాలి. వ్యక్తిగతంగా మా పైన, మా పార్టీ అధ్యక్షుడిపైన మాట్లాడడం మానుకోవాలి. మిర్చి రైతులకు మద్దతు ధర లేకుండా పోయింది. మిర్చి రైతులు నానా కష్టాలు పడుతున్నారు.
![]() |
![]() |