ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు దీరింది. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబుతో ఒప్పందాలు చేసుకున్నాయి. అలాగే లూలు సంస్థ సైతం మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకారం తెలిపింది.ఇవేగాకుండా టాటా సంస్థతోపాటు పలు ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా ఏపీలో తమ సంస్థలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. అయితే తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్‌ను ఫార్చూన్ 500 కంపెనీ సిఫీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజు వేగేశ్న ఇవాళ(బుధవారం) కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిఫీ ఛైర్మెన్ రాజు వేగేశ్న సుముఖత వ్యక్తం చేశారు. విశాఖలో మెగా డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుపై నారా లోకేష్ చర్చించారు. ఏపీలో పెట్టుబడులకు ప్రస్తుత అవకాశాలను మంత్రి లోకేష్ వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సేవలపై వివరణ ఇచ్చారు. నూతనంగా తీసుకువచ్చిన ఐటీ పాలసీల గురించి లోకేష్ ప్రస్తావించారు.
![]() |
![]() |