వందేళ్ల చరిత్ర కలిగిన విశాఖ పూర్ణామార్కెట్‌ను నమ్ముకుని చిరు వ్యాపారులు రోడ్డు పక్కన అమ్మకాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే ఆశీలు వసూళ్ల విషయంలో కొన్ని రోజులుగా వ్యాపారులతో తగదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం ముదిరి, చివరకు చిరు వ్యాపారులపై కక్ష సాధింపు చర్యలకు దారితీసింది. అధికారం ఉంది కదా అని కూటమి నేతలు అధికారులను పేద వ్యాపారులపై ఉసికొల్పి.. వారి పొట్టకొట్టారు. మొదటి రోజు పూర్ణామార్కెట్ పరిసరాల్లోని ఆక్రమణలు తొలగిస్తుండటంతో.. ప్రజలు, వ్యాపారులు సాధారణ ఆక్రమణల తొలగింపుగానే భావించారు. కానీ రెండో రోజు కూడా అధికార యంత్రాంగం బౌడారా రోడ్డు నుంచి రామకృష్ణ జంక్షన్ వరకు ఆక్రమణల పేరుతో వ్యాపారులను ఇబ్బందులకు గురి చేసింది. కూటమి నేతల తీరుతో తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |