దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ను రౌస్ అవెన్యూ కోర్టు దోషిగా తేల్చింది. 1984 నవంబర్ 1న సరస్వతి విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకుల హత్య కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా బుధవారంనాడు తీర్పునిచ్చారు. శిక్షపై వాదనలు వినేందుకు కేసును ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేశారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లో జరిగిన మరో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ప్రస్తుతం సజ్జన్ కుమార్ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు.తీర్పు సందర్భంగా సజ్జన్ కుమార్‌ను తీహార్ జైలు నుంచి బుధవారంనాడు కోర్టు ముందు హాజరుపరిచారు. 1984 నవంబర్ 1న జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్ హత్య కేసులో కోర్టు ఆయనను దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.
![]() |
![]() |