సింహాచలం దేవస్థానం భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నవారి సమస్యకు శాశ్విత పరిష్కారం లభించింది. సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సభ్యుల సమావేశంలో సింహాచలం భూముల వ్యవహారానికి పలు నిర్ణయాలు తీసుకున్నారు. 14 సంవత్సరాలుగా ఉన్న సింహాచలం భూముల సమస్యకు ఈరోజు సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సభ్యుల సమావేశంలో తుది పరిష్కారం లభించిందని మానవవనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నూరు గజాల లోపు భూమిలో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఉచితంగా, ఒకటి నుంచి 200 గజాల భూమికి 1998 ధరల్లో 7.5 శాతం చెల్లించాల్సి ఉంటుంది.200 నుంచి 300 గజాలకు 15 శాతం, 300 నుంచి 500 గజాల భూమికి 30 శాతం, 500 గజాలు పైన ఆక్రమణలకు వేలం ద్వారా ఇవ్వడం జరుగుతుందని మంత్రి గంటా వెల్లడించారు. ఒక్క విశాఖ నగరంలోనే 62000 మందికి సీఎం చంద్రబాబునాయుడు పట్టాలు ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. సింహాచలం భూముల రెగ్యులరైజేషన్ ద్వారా మరో 12000 మందికి లబ్ది చూకూరుతుందని ఆయన తెలిపారు. ఖాళీ స్థలాలు, వివాదాలు లేనివి, రిజిస్ట్రేషన్ చేయించుకున్న సింహాచలం భూములను పేదలకు ఇవ్వడం జరుగుతుందన్నారు.
దేవాదాయ శాఖకు కూడా నష్టం వాటిల్లకుండా ఆశాఖ కోల్పోయే భూమికి, ప్రత్యామ్నాయంగా భూమి ఇస్తామని గంటా తెలిపారు. భూమికి భూమి ఇవ్వడంతోపాటు, రెగ్యులరైజేషన్ ద్వారా వచ్చే మొత్తం కూడా సింహాచలం దేవస్థానానికి ఇస్తామని ఆయన వెల్లడించారు. 14 సంవత్సరాలుగా ఉన్న సింహాచలం భూముల సమస్యను పరిష్కరించినందుకు ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, సత్యన్నారాయణ మూర్తి, వాసుపల్లి గణేష్ లు, సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa