ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పీకర్ కోడెలతో లగడపాటి భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2019, 08:09 PM

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కీలకనేతలు చాలా మంది ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మంగళవారం మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మంగళవారం భేటీ అయ్యారు. గుంటూరు నగరంలోని చుట్టుగంట సెంటర్‌లోగల ఓ హోండా షోరూమ్‌లో వీరిద్దరూ ఏకాంతంగా చర్చలు జరిపారు. మరికొద్ది రోజుల్లోనే ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో వీరిద్దరూ ఏకాంతంగా చర్చలు జరపడం పట్ల పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa