ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా భావిస్తున్న రీ-సర్వేతో గ్రామంలో భూ సమస్యలు పరిష్కరించాలని చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు సూచించారు. పంగులూరు మండలంలోని బైటమంజులూరు గ్రామంలో జరుగుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను గురువారం స్థానిక అధికారులతో కలసి పరిశీలించారు. రైతుల సహకారంతో రీ-సర్వే ప్రక్రియ న్యాయబద్ధంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా భూ రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశా రు. అనంతరం నూజెళ్లపల్లి గ్రామంలో ప్రజావేదిక ద్వారా అందిన భూ సమస్యను పరిశీలించారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ సింగారావు, సర్వేయర్ సురేష్, శ్రీనివాసరావు, పలువురు సర్వేయర్లు, వీఆర్వోలు రైతులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa