ఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న అయోధ్య వివాదంపై నేడు కీలక విచారణ జరగనుంది. అయోధ్యలోని ‘రామజన్మభూమి-బాబ్రీ మసీదు’ భూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసును అత్యంత సున్నితమైనదిగా గుర్తించి దీనిని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చా అనే విషయంపై కోర్టులో విచారణ జరుగుతుంది. న్యాయస్థానం నియమించిన మధ్యవర్తికే ఈ బాధ్యతను అప్పగించవచ్చా? అనే విషయంపై కూడా నేడు క్లారిటీ రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa