న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్ పండిట్ దీన్‌దయాళ్ అంత్యోదయ భవనంలోని ఐదో అంతస్తులు అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 8:34 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు 25 ఫైరింజన్లు శ్రమిస్తున్నాయి. అయితే అక్కడ దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరాడక సీఐఎస్‌ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ మృతి చెందారు. మృతదేహాన్ని ఎయిమ్స్‌కు తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa