పెళ్లి సరదా తీరకుండానే ఆ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. గతేడాది ఇదే సమయంలోనే తండ్రి చనిపో యాడు. తండ్రి ఉద్యోగం ఓ వైపు రావల్సి ఉండగా, మరో వైపు పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ యువకుడ్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. వివరా ల్లోకి వెళితే.. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం కుడ్డపల్లి గ్రామానికి చెందిన సవర నవీన్ కుమార్ (21).. తనతో పెళ్లి నిశ్చియమైన ఓ యువతితో కలిసి విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా.. జాతీయ రహదారి కుశాలపురం బైపాస్ జంక్షన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొన డంతో నవీన్ అక్కడక్కడే మృతిచెందాడు. విజయవాడలో ఉంటున్న ఆ యువతి విశాఖ వచ్చిందని తెలిసి ఆమెను స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ యువతిని చికిత్స నిమిత్తం శ్రీకాకుళం సర్వజనాసు పత్రికి తరలించారు. మృతుడు తండ్రి సవర అనప పోలీసు హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ అనారోగ్యంతో గతేడాది మార్చిలో మృతిచెందాడు. తండ్రి ఉద్యోగం కారుణ్య నియామకం కింద నవీన్‌కుమార్‌కు ఓ వైపు రావల్సిఉండగా, మరో వైపు నిశ్చితార్ధం జరిగిన యువతితో వివాహం జరగాల్సిఉంది. ఈ పరిస్థితుల్లో నవీన్‌కుమార్ మృతితో ఆ కుటుంబ సభ్యుల రోదన వర్ణణాతీతం. కాగా నవీన్‌కు తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa