ఏమామ్మ మీ పిల్లలు ఇంటి దగ్గర బాగా చదువుతున్నారా.. పరీక్షల సమయం పిల్లల చదువుపై శ్రద్ద చూపాలి..ఇంటి పనులకు దూరంగా ఉండేలా చూసుకోవాలి..సెల్ ఫోన్ అసలే ముట్టోద్దు..భవిష్యత్తుకు తొలి మెట్టు పదో తరగతే..అంటూ జగదేవపూర్ ఎంఈఓ మాధవరెడ్డి పదో తరగతి పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి విద్యార్థి ఇంటికెళ్లి పిల్లల చదువుపై ఆరా తీస్తున్నారు. పరీక్షల సమయంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. జగదేవపూర్ మండలంలో ఇటిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదొ తరగతి విద్యార్థులు ఇటిక్యాలతో పాటు మర్కూక్ మండలంలో ఎర్రవల్లి, వరదరాజ్ పూర్, లింగారెడ్డి పల్లి గ్రామాల నుండి వస్తుంటారు. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
ప్రత్యేక తరగతుల సమయంలో విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాధవరెడ్డి శతశాతం ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పదో తరగతి విద్యార్థుల గ్రామాల్లో సాయంత్రం నుండి రాత్రి వరకు సందర్శించి విద్యార్థుల తల్లిదండ్రులకు సలహాలు ఇస్తున్నారు. ప్రతి విద్యార్థి ఇంటికెళ్లి చదువుపై ఆరా తీస్తూ సూచనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాధవరెడ్డి మాట్లాడుతూ పది ఫలితాల్లో వందకు వంద ఫలితాలు సాధించాలని లక్ష్యంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చెప్పినట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఇంటికెళ్లి విద్యార్థులు చదువుపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. పరీక్షల సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు ఎలాంటి పనులు చెప్పవద్దని సూచించారు. అలాగే సెల్ ఫోన్ ఇవ్వద్దని సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని కోరారు. పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తుకు తొలిమెట్టని పేర్కొన్నారు. భయభ్రాంతులకు గురి కాకుండా ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్న ఉపాధ్యాయుల అడిగి తెలుసుకోవాలని, ఉపాధ్యాయులు కూడా అందుబాటులో ఉంటూ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థి పది గ్రేడ్ లక్ష్యంగా పెట్టుకుని విద్యను అభ్యసించి పరీక్షలు రాయాలని కోరారు. పిల్లలపై తల్లిదండ్రులు పెట్టుకున్న కలలను సాకారం అయ్యే విధంగా విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. ప్రతిరోజు తెల్లవారు జామున లేచి రోజుకో సబ్జెక్టు చదవాలని సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పదవ తరగతి విద్యార్థుల ఇంటికెళ్లి పరీక్షలపై అవగాహన, చదువుపై ఆరా తీయనున్నట్లు వివరించారు...
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa