మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు, పండితులు, శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆహ్వానించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఈనెల 19వ తేదీ నుంచి మార్చి 1 వరకు మహోత్సవాలు జరుగుతున్నాయని సీఎంకు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు రావాలని వెలగపూడిలో సోమవారం సీఎంను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎంకు ఆలయ పండితులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.