ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పులబాధతో చనిపోతున్నానంటూ యువకుడు సెల్ఫీ వీడియో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 06:13 PM

పశ్చిమగోదావరి జిల్లాలో సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పోగోట్టుకున్నానని పేరుపాలెం బీచ్‌లో చనిపోతున్నానంటూ ఓ యువకుడు తన బంధువులకు సెల్ఫీ వీడియో పంపించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో పేరుపాలెం బీచ్‌లో మొగల్తూరు పోలీసులు గాలిస్తున్నారు.యువకుడు తన సెల్పీ వీడియోలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు.. అయితే ఇంత వరకు అతని ఆచూకీ లభ్యం కాలేదు. అప్పులు చేసి ఆన్ లైన్ బెట్టింగ్ ఆడానని.. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు పేరుపాలెం సముద్రం ఒడ్డున ఉన్న బైకును కనుగొన్నారు. అది యువకుడిదిగా భావిస్తున్నారు. సెల్ఫీ వీడియో తీసిన వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, బంగారుపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతని ఇంటికి వెళ్లడానికి పోలీసులు సిద్ధమయ్యారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అన్ని విషయాలు మీడియాకు వెళ్లడిస్తామని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa