ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వరా..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2025, 08:06 AM

గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ  వివాదంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హీరో మంచు మనోజ్ ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తూ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. తాజాగా తిరుపతి జిల్లా, భాక్ర పేటలో ప్రైవేట్ రిసార్ట్స్ లో మంచు మనోజ్ స్టే చేశారు. ఘాట్ రోడ్, ప్రైవేట్ రిసార్ట్స్ పరిసర ప్రాంతాలలో పోలీసులు సోమవారం అర్ధరాత్రి గస్తీ చేస్తున్న సమయంలో ప్రైవేట్ బౌన్సర్లు ఉండటాన్ని చూసి.. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయం బౌన్సర్లు మనోజ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన రిసార్ట్స్ నుంచి పోలీస్ స్టేషన్‌కు వచ్చి.. ‘నన్ను అరెస్టు చేయడానికి మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలుసు.. నన్ను అరెస్టు చేయండి..’ అంటూ మంచు మనోజ్ అన్నారు. దీంతో ‘మేము అరెస్టు చేయడానికి రాలేదు.. రాత్రి పూట హైవేపైన, ఘాట్ రోడ్ ప్రాంతంలో బౌన్సర్లు ఉండటంతో ఎవరు.. అన్న వివరాలు అడిగి తెలుసుకున్నాం’ అని భాక్రా పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ అన్నారు. ఈ క్రమంలో పీఎస్ దగ్గర మెట్లపై మంచు మనోజ్ కూర్చున్నారు. తాను రిసార్ట్స్‌లోఉంటే ఎందుకు వేధిస్తున్నారు.. తన గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారంటూ మంచు మనోజ్ పోలీసులను అడిగారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa