2025 ఛాంపియన్స్ ట్రోఫీ రేపు ప్రారంభం కాబోతోంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఎనిమిది జట్లు ఈ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. రేపు కరాచీలో జరిగే మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్, న్యూ జిలాండ్ తో తలపడడంతో ఈ టోర్నీ ప్రారంభం అవుతుంది. అయితే ఈసారి పాకిస్తాన్ జట్టు ఫామ్ లో లేకపోవడంతో వారి సెమీఫైనల్ అవకాశాలపై అనుమానాలు నెలకొన్నాయి. ఇక చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లను ఈసారి భారత్ లో జియో, హాట్ స్టార్ నెట్వర్క్ ప్రసారం చేయనున్నాయి. ఇందులో భాగంగానే టీవీలో స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 చానల్స్ లో ప్రసారం కానున్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, బెంగాలీ, భోజ్పురి, తమిళ్, కన్నడ వంటి ఎనిమిది భాషలలో ఈ మ్యాచ్లు ప్రసారం కానున్నాయి. ఇక డిజిటల్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే జియో హాట్ స్టార్ లో వీక్షించవచ్చు.
![]() |
![]() |