ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా యష్తిక ఆచార్య మృతి

national |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 08:53 PM

ప్రమాదవశాత్తు 270 కిలోల రాడ్డు మెడ మీద పడటంతో రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో వెయిట్ లిఫ్టర్ యష్తిక ఆచార్య మృతి చెందింది. 17 ఏళ్ల ఆచార్య జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఆమె ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాడ్డు మీద పడటంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆచార్య గతంలో జూనియర్ నేషనల్ గేమ్స్‌లో స్వర్ణపతకాన్ని గెలుచుకుకుంది. ఈ ఘటనలో శిక్షకుడికి కూడా స్వల్పంగా గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa