ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెల్లగా ఉండే కొన్ని ఆహారాల్ని అస్సలు తినకండి, తింటే ఏమవుతుందో తెలుసా

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Feb 23, 2025, 11:31 PM

ప్రస్తుత జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, చాలా మందిలో యూరిక్ యాసిడ్ సమస్య తీవ్రంగా కనిపిస్తుంది. ఆహారం, డ్రింక్స్‌లో ఉండే ప్యూరిన్స్ అనే రసాయనాల్ని శరీరం విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. బిజీ లైఫ్ స్టైల్, ఎలా పడితే అలా తినడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం ఇవన్నీ రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతున్నాయి.


యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఈ వ్యాధి ప్రధాన లక్షణాల్లో కీళ్ల నొప్పులు ముందు వరుసలో ఉంటుంది. యూరిక్ యాసిడ్ స్థాయి 7.0 mg/dl కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది కీళ్లలో స్పటికాల రూపంలో పేరుకుపోతుంది. దీంతో కీళ్లల్లో నొప్పి, వాపు కలుగుతుంది. ఇక, యూరిక్ యాసిడ్‌ని తగ్గించుకోవాలంటే తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. కొన్ని తెల్లటి ఆహారాలకు దూరంగా ఉంటేనే మంచిది. కొన్ని వైట్ ఫుడ్స్ తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి కిడ్నీలకు ప్రమాదం. యూరిక్ యాసిడ్ ఉంటే ఏ వైట్ ఫుడ్స్ తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.


పెరిగిన యూరిక్ యాసిడ్ లక్షణాలు


* కీళ్లలో నొప్పి లేదా వాపు


* కీళ్ల చుట్టూ ఉన్న చర్మం రంగు మారడం


* తాకినప్పుడు కీళ్ళు వెచ్చగా అనిపించడం


* తరచుగా మూత్ర విసర్జన చేయడం


* అరికాళ్ళు ఎర్రగా మారడం


* బొటనవేలులో నొప్పి


క్యాబేజీ, క్యాలీఫ్లవర్


ఎన్ హెచ్ఐ నివేదిక ప్రకారం క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ని యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు తినకూడదు. ఈ కూరగాయల్లో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. యూరిక్‌ యాసిడ్‌ సమస్యతో బాధపడేవారు.. ప్యూరిన్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే.. పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. అందుకే వీటిని ఎక్కువగా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


పుట్టగొడుగులు


ఒకప్పటితో పోలీస్తే పుట్టగొడుగులను తినే ట్రెండ్ బాగా పెరిగింది. ఈ రోజుల్లో చాలా మంది మష్రూమ్స్‌ను ఇష్టంగా తింటారు. పుట్టగొడుగుల కూర, బిర్యానీ, మష్రూమ్ పెప్పర్ ఫ్రై, మష్రూమ్ మంచురియా ఇలా రకరకాల వంటకాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలా మంది పుట్టగొడుగుల్ని తమ ఫేవరేట్ ఫుట్స్‌లోకి చేర్చుకున్నారు. అయితే, సాధారణంగా పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచిదే. అయితే, పుట్టగొడుగుల్లో కూడా ప్యూరిన్ ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో, యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు వీటిని మితంగా తీసుకుంటే బెస్ట్ అంటున్నారు నిపుణులు. ఎక్కువగా తింటే యూరిక్ యాసిడ్ బాగా పెరిగిపోతుందంటున్నారు.


వైట్ బ్రెడ్


వైట్ బ్రెడ్‌ను మీ ఆహారం నుంచి పూర్తిగా తొలగించండి. వైట్ బ్రెడ్‌లో పీచు పదార్థం ఉండదు. దీంతో.. ఇది జీర్ణక్రియకు మంచిది కాదు. ఇది ఎక్కువ తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. అంతేకాకుండా వైట్ బ్రెడ్ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే ప్రమాదముంది. దీనిని ఎక్కువ తింటే బరువు పెరిగే ప్రమాదముంది. శుద్ది చేసిన వైట్ బ్రెడ్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది తినడం వల్ల శరీరంలో మంట, వాపు వచ్చే ప్రమాదముంది. దీంతో పాటు కీళ్లలో యూరిక్ యాసిడ్ బాగా పేరుకుపోతుంది.​


చక్కెర


తెల్ల చక్కెరతో పాటు షుగరీ డ్రింక్స్, షుగరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకూడదంటున్నారు నిపుణులు. చక్కెర ఎక్కువ తింటే ఆరోగ్యానికి ముప్పు కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కెర ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే ప్రమాదముంది. చక్కెర ఎక్కువగా తినడం వల్ల తాత్కాలికంగా ఎనర్జీ వస్తుంది. కానీ, కొన్ని వ్యతిరేక ప్రభావాల వల్ల శక్తిని కోల్పోయి నీరసంగా ఉంటారు.


ఉప్పు


తెల్ల రంగులో ఉండే ఉప్పు ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయి. దీంతో.. దాహం ఎక్కువగా వేస్తుంది. యూరిన్‌కి ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది. ఉప్పు ఎక్కువగా తీసుకునేవారి శరీరంలో వాపులు వచ్చే ప్రమాదముంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిపై ప్రభావం చూపుతుంది. దీంతో, కీళ్ల నొప్పులు ఎక్కువయ్యే ప్రమాదముంది. అందుకే వైట్ సాల్ట్‌ని మానేయండి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com