ఎక్కువగా తిరుమల శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే పునుగుపిల్లి ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలో ప్రత్యక్షమైంది. ఈ అరుదైన పునుగుపిల్లి స్థానిక ముగ్గురోడ్డు కొండ ప్రాంతంలోని ఓ ఇంటి వద్ద ఉదయం ప్రత్యక్షమవడంతో తొలుత ఏ జంతువో అర్థం కాక స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు వచ్చి.. దానిని పట్టుకున్నారు. దానిని పునుగుపిల్లిగా నిర్థారించారు. స్థానిక వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించిన అనంతరం, తిరిగి అడవిలో విడిచిపెట్టనున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa