ఏపీ డీజీపీ ఠాకూర్‌ను సిట్ ఇన్‌ఛార్జ్ సత్యనారాయణ కలిశారు. ఓట్ల తొలగింపునకు ఉద్దేశించిన ఫారం-7 దుర్వినియోగంపై ఏపి ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఇప్పటి వరకు నమోదైన కేసులు, విచారణ తీరుపై సిట్ ఇన్‌ఛార్జ్ సత్యనారాయణ డీజీపీతో చర్చించారు. బృందాలుగా విడిపోయి ఈ కేసును దర్యాప్తు చేయనున్నారు. రాష్ట్రంలో అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు కొందరు వ్యక్తులు ఆన్‌లైన్‌లో పెద్దఎత్తున ఫారం-7 దరఖాస్తులు చేశారు. ఈ మేరకు పది రోజుల్లో 8.74 లక్షల దరఖాస్తులు ఈసికి అందాయి. వీటిలో అత్యధిక శాతం నకిలీవేనని గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa