హిందూపురం నియోజకవర్గం వ్యాప్తంగా ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలలో అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంగళవారం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఈరేష్, తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఈరేష్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుతున్నారు. కానీ కొందరు సంబంధిత శాఖ అధికారులు డబ్బులు తీసుకొని అవకతవకలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa