అనంతపురం నగర శివారులో మంగళవారం ముందు వెళ్తున్న లారీని వెనుక వైపు నుంచి మరోలారీ అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన లారీ డ్రైవర్ రాహిల్ అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు వివరించారు.
గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బెంగళూరు నుంచి రాజస్థాన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa