ఓ పార్టీ సభ్యులు అసెంబ్లీ హుందాతనాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఆ పార్టీ సభ్యుల ప్రవర్తనపై సభా హక్కుల కమిటీకి స్పీకర్ ఫిర్యాదు చేయాలని కోరారు. సభా హక్కులను విస్మరించి, ప్రజలను తప్పుదారి పట్టించేలా దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నానని నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. సభా హక్కుల కమిటీకి ఈ అంశాన్ని రిఫర్ చేయాలని ఆయన స్పీకర్ ను కోరారు. "సభా హుందాతనాన్ని కాపాడే బాధ్యత సభ్యులందరిపైనా ఉంది. ఓ పార్టీ సభా నియమాలను దుర్వినియోగం చేస్తూ నిరాధార ఆరోపణలు చేస్తోంది. సభాపతి తీసుకున్న నిర్ణయం (రూలింగ్) పూర్తిగా సమంజసమైంది. సభా హక్కుల కమిటీ దీనిపై లోతుగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రాభివృద్ధికి ఆ పార్టీ కూడా సహకరించాలి, లేకపోతే ప్రజలే వారిని తిరస్కరిస్తారని హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక విధ్వంసం నుండి బయటికి వచ్చి ఆంధ్రప్రదేశ్ ను మరోసారి అభివృద్ధి పథంలో నడిపించాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలి" అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa