స్నానానికి ముందు కొన్ని సహజ పదార్థాలు అప్లై చేస్తే ముఖం మీద మచ్చలు తొలగిపోతాయి. ముఖం మీద మచ్చలు తొలగిపోయి అందం రెట్టింపు అవ్వాలంటే స్నానానికి ముందు అప్లై చేయాల్సిన సహజ పదార్థాలేంటో తెలుసుకుందాం. అందంగా ఉండాలని ఎవరూ కోరుకోరు. ప్రతి ఒక్కరూ మెరిసే చర్మం, గ్లాసీ స్కిన్ కావాలని కోరుకుంటారు. చర్మ సంరక్షణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు తేడా లేకుండా అందం కోసం నానాతంటాలు పడుతున్నారు. ఇక, ముఖ చర్మం శరీరంలో అత్యంత సున్నితమైన భాగం. ఇది కాలుష్యం, సూర్యకాంతి, తినే తిండి అలవాట్ల కారణంగా ఎఫెక్ట్ అవుతుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు, ముడతలు లేదా ఇతర సమస్యలు ఉండటం సాధారణంగా మారింది.
మీరు కూడా చర్మ సమస్యలతో బాధపడుతూ ముఖం మెరిసి పోవాలని కోరుకుంటే స్నానానికి కొన్ని ఇంటి నివారణల్ని పాటించాలి. ఈ ఇంటి చిట్కాల వల్ల కొన్ని రోజుల్లోనే మీరు ప్రభావం చూస్తారు. స్నానానికి ముందు కొన్ని సహజ పదార్థాలు అప్లై చేస్తే ముఖం మీద మచ్చలు తొలగిపోతాయి. ముఖం మీద మచ్చలు తొలగిపోయి అందం రెట్టింపు అవ్వాలంటే స్నానానికి ముందు అప్లై చేయాల్సిన సహజ పదార్థాలేంటో తెలుసుకుందాం.
కలబంద జెల్
కలబందను చర్మానికి ఒక అద్భుత నివారణగా భావిస్తారు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉంటాయి. కలబంద జెల్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ముఖం మీద ఉన్న మచ్చల్ని తగ్గిస్తుంది. ఇందుకోసం స్నానం చేసే ముందు తాజా కలబంద జెల్ తీసి ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాలు అలాగే ఉంచండి. దీని తర్వాత స్నానం చేయండి. కలబంద చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు మృదువుగా, మెరిసేలా చేస్తుంది. క్రమం తప్పకుండా వాడటం వల్ల మొటిమలు, మచ్చలు మాయమవుతాయి.
పసుపు,పెరుగు ప్యాక్
పసుపు, పెరుగు కలయిక చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది చర్మపు మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో, పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి ప్రకాశవంతం చేస్తుంది. స్నానం చేసే ముందు, ఒక చెంచా పెరుగులో చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఈ ప్యాక్ చర్మపు రంగును క్లియర్ చేయడానికి, మచ్చలను తగ్గించడానికి సాయపడుతుంది.
నిమ్మరసం
నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మపు మచ్చలను తగ్గించడంలో, చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. స్నానం చేసే ముందు, నిమ్మరసాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాలు అలాగే ఉంచండి. దీని తర్వాత స్నానం చేయండి. నిమ్మరసం చర్మాన్ని కొద్దిగా సున్నితంగా మారుస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి వారానికి 2-3 సార్లు మాత్రమే వాడండి. క్రమం తప్పకుండా వాడటం వల్ల చర్మపు రంగు మెరుగుపడి, మచ్చలు తగ్గుతాయి.
తేనె, దాల్చిన చెక్క మిశ్రమం
తేనె ఒక సహజ మాయిశ్చరైజర్. ఇది చర్మానికి తేమను అందించి మృదువుగా చేస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. స్నానం చేసే ముందు, ఒక చెంచా తేనెలో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఈ ప్యాక్ చర్మంపై ఉన్న మచ్చలను తగ్గించి, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
శనగపిండి, రోజ్ వాటర్
శనగపిండి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో, శుభ్రపరచడంలో సహాయపడుతుంది. అదే సమయంలో, రోజ్ వాటర్ చర్మాన్ని రిఫ్రెష్ చేసి, ఉపశమనం కలిగిస్తుంది. స్నానం చేసే ముందు, శనగపిండి, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. 10-15 నిమిషాల తర్వాత స్నానం చేయండి. ఈ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వాడటం వల్ల చర్మ ఛాయ మెరుగుపడి మెరుస్తుంది.
పాటించాల్సిన జాగ్రత్తలు
ఎవరికైనా చర్మానికి సంబంధించిన అలర్జీలు ఉంటే వీటిని పాటించేముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. అంటే పైన చెప్పిన సహజ పదార్థాల్ని ముఖానికి కాకుండా చెవి వెనుక భాగాన అప్లై చేయండి. అక్కడ ఏదైనా రియాక్షన్ వస్తే అప్లై చేయకండి. రియాక్షన్ లేకపోతే వీటిని అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ చర్మం సున్నితంగా ఉంటే వీటిని పాటించేముందు నిపుణుణ్ని సంప్రదించి సలహాలు తీసుకోండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa