ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న బీఎడ్ ప్రశ్నపత్రం లీక్ అయింది. ఈ పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు ఈ ప్రశ్న పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. గుంటూరు జిల్లాలోని ఓ కళాశాల యాజమాన్యమే ఈ ప్రశ్న పత్రం లీక్ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్‌మెంట్ పరీక్షను నిర్వహించారు. అయితే అరగంట ముందే ఈ పరీక్ష పత్రం లీక్ అవడం గమనార్హం. మరోవైపు మార్చి 6వ తేదీ నుంచి బీఎడ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమైనాయి. తొలిరోజే.. ఈ ప్రశ్న పత్రం లీక్ అయిందని విమర్శలు వెల్లువెత్తాయి.ఇంకోవైపు ఈ పరీక్షల నిర్వహణపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉన్నతాధికారులను వివరణ కోరగా.. ఈ అంశంపై తమకు ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. ఇక గతంలో యూనివర్శిటీ తరపున ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్‌కు పంపించి అక్కడి నుంచి పరీక్షా కేంద్రాలకు తరలించేవారు. కానీ ఈ సారి మాత్రం ప్రశ్నాపత్రాలను కాలేజీలకు సీడీల్లో పంపించారు. అరగంట ముందు సీడీ పాస్ వార్డ్‌లు యాజమాన్యాలకు పంపిస్తున్నారు. దీంతో ప్రశ్నపత్రాల విషయంలో పోలీసుల పర్యవేక్షణ లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. యాజమాన్యాలకు పాస్ వార్డ్ రాగానే ప్రశ్న పత్రాన్ని విద్యార్థులకు పంపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa