ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత్ తొలుత బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లోనూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్ ద్వారా వరుసగా 15వ వన్డే మ్యాచ్‌లో టాస్ ఓడిపోయాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ నుంచి టీమిండియా వన్డేల్లో ఒక్కసారి కూడా టాస్ గెలవకపోవడం గమనార్హం.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తొలుత బ్యాటింగ్ చేయనున్నట్లు చెప్పాడు. పిచ్ స్వభావాన్ని బట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు వెల్లడించాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో గాయపడ్డ కివీస్ స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని శాంట్నర్ టాస్ సందర్భంగా తెలిపాడు. మ్యాట్ హెన్రీ స్థానంలో తుది జట్టులోకి నాథన్ స్మిత్‌ను తీసుకున్నట్లు చెప్పాడు.
ఇక భారత్ ఈ మ్యాచ్‌కు ఎలాంటి మార్పుల్లేకుండానే బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆడిన తుది జట్టుతోనే ఆడడనున్నట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు. కాగా ఈ టోర్నీలో లీగ్ దశలో భారత్, కివీస్ జట్లు తలపడ్డాయి. అందులో భారత జట్టు విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్‌లోనూ అతడు మ్యాజిక్ చేయాలని భారత్ కోరుకుంటోంది.
తుది జట్లు..
భారత్:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
న్యూజిలాండ్:
విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డేరిల్ మిచెల్, టామ్ లేథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకెల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), కైల్ జెమీసన్, విలియమ్ ఓరూర్కే, నాథన్ స్మి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa