ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెల్లజుట్టుకి కెమికల్ డై వేస్తున్నారా, అవసరమే లేదు కొన్ని నూనెలతోనే నల్లగా

Life style |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 11:54 PM

ప్రజెంట్ జనరేషన్‌లో అన్నీ త్వరగానే వచ్చేస్తున్నాయి. అందులో తెల్ల జుట్టుకూడా. ఇదివరకటి రోజుల్లో అయితే ఎప్పుడో 40, 50 దాటిన వారికి వచ్చేవి. కానీ.. ఇప్పుడు ఎంత త్వరగా అభివృద్ధి చెందుతున్నామో.. హెల్త్, బ్యూటీ ప్రాబ్లమ్స్ కూడా అంతేత్వరగా వచ్చి చేరుతున్నాయి. అందులో తెల్లజుట్టు కూడా ఒకటి. వీటికి చాలానే కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, పోషకాహార లోపం, కెమికల్ హెయిర్ ప్రోడక్ట్స్ ఎక్కువగా వాడడం, సరిలేని ఆహారం వంటివన్నీ కూడా. ఆయుర్వేదం ప్రకారం పిత్త దోషం ఎక్కువగా ఉన్నవారికి త్వరగా జుట్టు తెల్లబడుతుంది. కారణం తలపై ఎక్కువగా వేడి ఉండడమే. దీని వల్ల జుట్టు పిగ్మంటేషన్ తగ్గుతుంది. వీటిని కవర్ చేయడానికి కెమికల్ ప్రోడక్ట్స్ బదులు ఆయుర్వేదాన్ని ఫాలో అయితే జుట్టు నల్లగా మారడంతో పాటు హెల్దీగా కూడా ఉంటుందని డాక్టర్ రోహిత్ మాధవ్ సేన్(ఫౌండర్ అండ్ సీఈఓ, మాధవ్‌బాగ్) చెబుతున్నారు. అందుకోసం నాలుగు ఎఫెక్టివ్ ఇంటి చిట్కాలని కూడా సూచిస్తున్నారు. అవేంటంటే


ఉసిరి, భృంగరాజ్


కావాల్సిన పదార్థాలు


2 టేబుల్ స్పూన్ల ఉసిరిపౌడర్2 టేబుల్ స్పూన్ల భృంగరాజ్ పౌడర్4 టేబుల్ స్పూన్ల కొబ్బరి లేదా నువ్వుల నూనె


తయారీ విధానం


ఓ పాన్‌లో కొబ్బరినూనెని వేడి చేసి, ఉసిరి, భృంగరాజ్ పౌడర్స్ వేసి కలపండి. పదార్థాలు బాగా కలిసేవరకూ నూనెని 5 నుంచి 7 నిమిషాల పాటు తక్కువ మంటపై పెట్టి మరగనివ్వండి. ఈ నూనె చల్లబడనివ్వండి. తర్వాత వడకట్టండి. గోరువెచ్చగా ఉన్న నూనెని తలకి రాసి సున్నితంగా మసాజ్ చేయండి. తలకి రాసిన తర్వాత రాత్రంతా అలానే ఉంచి మరుసటి ఉదయాన్నే మైల్డ్ హెర్బ్‌ల్ షాంపూతో క్లీన్ చేయండి. బెస్ట్ రిజల్ట్ కోసం వారానికి 3 సార్లు చేయండి.


బెనిఫిట్స్


ఉసిరిలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు త్వరగా తెల్లబడడాన్ని తగ్గిస్తాయి. భృంగరాజ్ మెలనిన్ ఉత్పత్తిని పెంచి జుట్టు కుదుళ్లని బలంగా చేస్తుంది.


కరివేపాకుతో


కావాల్సిన పదార్థాలు


10 నుంచి 15 తాజా కరివేపాకు4 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె


తయారీ విధానం


ఓ పాన్‌లో కొబ్బరినూనెని వేడి చేసి కరివేపాకు వేయండి. ఆకుల్లోని పోషకాలు నూనెలోకి విడుదలవుతాయి. నూనె కాస్తా రంగు మారేవరకూ మరిగిచండి. ఇది చల్లారక వడకట్టండి. ఈ నూనెని తలకి అప్లై చేసి 5 నుంచి 10 నిమిషాల పాటు మసాజ చేయండి. 1 లేదా 2 గంటలు అలానే ఉంచి తర్వాత హెర్బల్ షాంపూతో క్లీన్ చేయండి. వారానికి రెండు సార్లు ఈ చిట్కాని ఫాలో అయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి.


బెనిఫిట్స్


కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లని బలంగా చేస్తాయి. నల్లగా మారుస్తాయి. పైగా వీటిని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.


హెన్నా, ఇండిగో నేచురల్ హెయిర్ డై


కావాల్సిన పదార్థాలు


4 టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్4 టేబుల్ స్పూన్ల ఇండిగో పౌడర్1 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి1 టేబుల్ స్పూన్ కాఫీ పొడితగినంత నీరు


తయారీ విధానం


హెన్నా పౌడర్‌ని గోరువెచ్చని నీటితో కలిపి మృదువైన పేస్టులా తయారు చేయండి. 4 నుంచి 6 గంటలు అలానే ఉంచండి. దీన్నంతా జుట్టుకి అప్లై చేసి 2 గంటలు అలానే ఉంచండి. తర్వాత క్లీన్ చేయండి. ఇండిగో పౌడర్‌ని కూడా గోరువెచ్చని నీటితో కలిపి చిక్కని పేస్టులా తయారుచేయండి. దీనిని కూడా జుట్టుకి అప్లై చేసి 1 నుంచి 2 గంటలు అలానే ఉంచి ప్లెయిన్ నీటితో కడగాలి. సహజంగా నల్లని జుట్టుకోసం నెలకి ఓ సారి దీనిని వాడండి.


బెనిఫిట్స్


హెన్నా జుట్టుని కండీషన్ చేస్తుంది. బలంగా మారుస్తుంది. ఇండిగో సహజ రంగుగా పనిచేస్తుంది. డీప్ బ్లాక్ కలర్‌ని ఇస్తుంది. దీని వల్ల కెమికల్స్ లేకుండా జుట్టు నేచురల్‌గానే నల్లగా మారుతుంది.


నల్ల నువ్వులు, బాదం


కావాల్సిన పదార్థాలు


1 టేబుల్ స్పూన్ నువ్వులు5 బాదం1 టీస్పూన తేనె


తయారీ విధానం


నల్ల నువ్వులు, బాదంలను రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయాన్నే వాటిని పేస్టులా మిక్సీ పట్టండి. ఈ పేస్ట్‌ని తేనెతో కలిపి ప్రతి రోజ పరగడపున తినండి.


బెనిఫిట్స్


నల్లనువ్వుల్లో మెలనిన్‌ని ఉత్పత్తిని ప్రోత్సహించే ఐరన్, ఖనిజాలతో నిండి ఉంటుంది. బాదం జుట్టు పెరుగుదలకి, తల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలని అందిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa