ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ కాశి నుంచే మోదీ పోటీ.. ఆ నిబంధన సడలింపు

national |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 07:02 PM

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే అంశం చర్చనీయాంశం అయింది. ప్రధాని నరేంద్ర మోదీని మళ్ళీ వారణాసి నుంచే బరిలోకి దింపాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. వారణాసి నియోజకవర్గం బాగా కలిసి రావడంతో మళ్లీ అక్కడినుంచే పోటీచేయాలని మోదీ కూడా భావిస్తున్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈమేర నిర్ణయం తీసుకున్నారు. గత 2014 ఎన్నికల్లో మోదీ వారణాసి నుంచి పోటీచేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వెనర్ కేజ్రీవాల్‌పై మోదీ  మూడు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో మోదీ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్‌కు కేవలం 75 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. కాగా, ఈ ఎన్నికల్లో మోదీ పోటీలో నిలిచే రెండవ నియోజకవర్గం ఏంటనే విషయమై త్వరలో స్పష్టత రానుంది. మోదీ నేతృత్వంలో 2014 ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ పార్టీ.. ఎన్నికల తరువాత ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలో 75 సంవత్సరాలు దాటిన నేతలకు ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. దీనితో అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్ నేతలు కూడా సైలెంట్ కావాల్సి వచ్చింది. అప్పుడు మోదీ గాలి విస్తృతంగా వీయడంతో సీనియర్లు కూడా మోదీ ఏజ్ లిమిట్ నిర్ణయానికి అడ్డు చెప్పలేకపోయారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారడంతో సీనియర్లను కూడా కలుపుకొని పోవడానికి ఏజ్ లిమిట్ నిర్ణయాన్ని పక్కన పెడుతూ 75 ఏళ్ళు దాటిన నేతలకు కూడా టిక్కెట్లు ఇవ్వనున్నట్టు నిర్ణయం తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa