మురళీమోహన్ తమ పూర్వీకులు వందేళ్ల క్రితం నిర్మించిన ఇంటిని పునరుద్ధరించారు. ఏలూరు జిల్లాలోని చాటపర్రులో ఉన్న ఈ పురాతన భవంతిని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. ఈ పునరుద్ధరణ ద్వారా రాబోయే 50-60 సంవత్సరాల వరకు భవనం చెక్కుచెదరకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇది మురళీ మోహన్ తాత గారు నిర్మించిన ఇల్లు. తన కుటుంబ సభ్యులతో కలిసి మురళీమోహన్ ఈ గృహప్రవేశ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తన గ్రామ స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడిపారు. మురళీమోహన్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ భవంతిని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa