ట్రెండింగ్
Epaper    English    தமிழ்

13 నుంచి సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 07:28 PM

లోక్‌సభ నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహిస్తూ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 13 నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారరు. రోజుకో జిల్లాలో ఆయన పర్యటిస్తారు. జిల్లా పర్యటనల్లో భాగంగా ఆయన  క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. జిల్లా స్థాయి నాయకుల నుంచి బూత్‌ కమిటీల సభ్యుల స్థాయి వరకు ఉన్న పార్టీ కేడర్‌తో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల్లో ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి రావాలనుకుంటున్నవారిని ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పార్టీలో చేర్చుకుంటారు. ముఖ్యమంత్రి ఈ నెల 17న విశాఖ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa