డేటా చోరీతో ప్రజల సమాచారం భయటకొచ్చిందని ప్రశ్నిస్తుంటే, కౌంటర్ గా ఆస్తులు దొంగతనాలు చేయొచ్చని అంటున్నారని వైసీపీ నాయకులు బుగ్గన్న రాజేంధ్రానాథ్ రెడ్డి తెలిపారు. భద్రత ఇవ్వాల్సింది మీరే కదా మీ ఫేల్యురే ఇది అని తెలిపారు. ఇంకా కంప్లేయింట్లు ఇస్తామని ఎన్ని తప్పులు ఉంటే అన్ని ఇస్తామని అన్నారు. కంప్లేయింట్ ఈసీకి ఇవ్వకుండా టీడీపీకి ఇవ్వాలా అని తెలిపారు. గజదొంగల పార్టీ మీదని పేర్కొన్నారు. ఇంతమంది సమాచారం మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఇంత వరకు ఒక్కరైనా సమాధానం ఇచ్చారా అని తెలిపారు. పార్టీ డేటా నా ప్రజల డేటా నా చెప్పాలని ప్రశ్నించారు. 26న వస్తే 27న యాప్ ను ఎందుకు మార్చినారో తెలపాలని ప్రశ్నించారు. అసలు వ్యక్తి గత సమాచారం ఆదార్ లేకుండా జరుగుతాయా అని, ఫోన్ నెంబర్లు, ఇంట్లో ఎంత మంది ఉన్నారు అనే సమాచారం ప్రయివేటు సంస్థకు ఎలా వెళ్లిందన్నారు. ఎవరు ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా మీకు తెలుస్తుందని అన్నారు. దొంగతనం ఆరోపిస్తే అశోక్ ఎందుకు కనబడకుండా పోయారని ప్రశ్నించారు. విజయ్ సాయిరెడ్డి ఈసీకి కంప్లెంట్ ఇస్తే తప్పేంటి అని అడిగారు. తప్పు జరిగిందని కంప్లెయింట్ ఇస్తే తప్పేంటి. కంప్లెయింట్ ను పట్టుకుని పట్టుకున్నామని చెబుతున్నారని పేర్కొన్నారు. ఆధార్ డేటాను దొంగతనం చేసినట్టు ఆ కంప్లేయింట్ లో కనపడుతోందని అన్నారు. చట్ట ఉల్లంగనలకు పాల్పడినారు కాబట్టే చర్యలు తీసుకోమంటున్నాం. డేటా ను వేరే దేశంలో దాచినట్టు సమాచారం ఉంది దానిపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. సాధికార మిత్ర లో వ్యక్తి గత సమాచారం సేకరించారు. ఎస్ఆర్ డీహెచ్ కు పంపినారు అక్కడి నుంచి ఐటిగ్రిడ్ కు అక్కడి నుంచి టీడీపీకి సమాచారం ఎలా వచ్చింది చెప్పాలని ప్రశ్నించారు. వేమూరి అశోక్ రెడ్డి ఈవీఎం హ్యాకింగ్ లో పట్టు పడినది నిజమా కాదా తెలపాలి. వోటర్ లీస్టులో కలర్ ఫోటో దేశంలోనే ఎక్కడా లేదు. 50లక్షల టీడీపీ డేటా మాకవసరంలేదని పేర్కొన్నారు. 3.60కోట్ల మంది సమాచారం ఎలా వచ్చిందని తెలిపారు. లోకేష్ నాయుడు చెప్పాల్సిన వివరాలు మీరేందుకు ఇస్తున్నారు. పేజీ నెంబర్ అని విడివిడిగా చదివితే ఏముంది అందులో అని ప్రశ్నించారు. సింగిల్ పాయింట్ కు కూడా సమాధానం లేకుండా ఆంధ్రుల ఆత్మ గౌరవం అని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. అశోక్ దాకవరంను ఎందుకు దాచినారని తెలిపారు. ఎవరైన హాక్యర్లు ఆ సంస్థలోకి వెలితే ఏవరిది బాధ్యత అని తెలిపారు. నోటిఫికేషన్ కోసం ప్రజలు వెతుక్కుంటున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ తో అతని వ్యక్తి గత ఇబ్బందులు పెట్టుకుని మాపై ఆరోపిస్తున్నారని తెలిపారు. ఓటుకు నోటు కేసుతో వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయన్నారు. రెండు పేపర్లు, రెండు చానళ్లు ఉంటే సరిపోదని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa