ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అజారుద్దీన్ తనయుడితో సానియా చెల్లి పెళ్లి

national |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 07:13 PM

మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కొడుకు అసదుద్దీన్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెల్లెలు ఆనమ్ మీర్జా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారట. కొద్ది రోజులుగా ఆనమ్.. అసద్ లవ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సానియా చెల్లి ఆనమ్.. 2015లో హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ అక్బర్ రషీద్‌ను పెళ్లి చేసుకుంది. అయితే కొద్దిరోజులుగా వీరిద్దరు దూరంగా ఉంటున్నారు. ఇటీవల విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు.
ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహిత వ్యక్తుల సమాచారం ప్రకారం.. భర్తతో విడిపోయిన తర్వాత.. ఆనమ్, అసద్‌‌ ప్రేమలో పడ్డారని, ఈ ఏడాది ఆఖర్లో ఇద్దరు పెండ్లి చేసుకునే అవకాశముందని సమాచారం. దాంతో పాటు వీరిద్దరూ కలిసి దుబాయ్‌లో షాపింగ్ చేసినప్పటి ఫొటోలు పోస్ట్ చేయడం పెళ్లి నిజమేనని తెలుస్తోంది.
తాజాగా సానియా కూడా సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేసి పెళ్లి నిజమేనని క్లారిటీ ఇచ్చింది. అసద్‌తో తాను దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన సానియా.. ఆ ఫొటో కింద ఫ్యామిలీ అని క్యాప్షన్‌ పెట్టింది. అసద్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సానియా, ఆనమ్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. దానికి ‘ఇద్దరు అద్భుతమైన మహిళలు’ అని క్యాప్షన్ పెట్టాడు. ఇదంతా చూస్తే వీరిద్దరి పెళ్లి ఖాయమేనని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa