అమరావతి: నరసరావుపేట ఎంపీ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో తెదేపా అభ్యర్థుల ఎంపికపై నేడు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మాచర్ల టికెట్‌ను అంజిరెడ్డి, చలమారెడ్డి ఆశిస్తున్నారు. నరసరావుపేట అసెంబ్లీ టికెట్‌ను కోడెల కుటుంబం ఆశిస్తోంది. ఇదే స్థానానికి రావెల సత్యం, కడియాల వెంకటేశ్వరరావు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటికే సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోడెల శివప్రసాదరావు ఉన్నారు. కానీ సత్తెనపల్లి సీటుకు రాయపాటి రంగబాబు, తెలుగు యువత నేత మల్లి పోటీపడుతున్నారు. గురజాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా యరపతినేని శ్రీనివాస్, చిలకలూరి పేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రత్తిపాటి పుల్లారావు, వినుకొండకు జీవీ ఆంజనేయులు , పెదకూరపాడుకు కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa