ఏపీలో విద్యార్థులు, వారి తల్లితండ్రులు.. నిరుద్యోగుల పక్షాన వైయస్ఆర్‌సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ కార్యక్రమం చంద్రబాబు ప్రభుత్వానికి తొలి హెచ్చరికలాంటిదని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో యువత పోరు నిర్వహించారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు, వారి తల్లుతండ్రులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టర్ కార్యాలయాల వరకు వైయస్ఆర్‌సీపీ భారీ ర్యాలీలు నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైయస్ జగన్ తన ఎక్స్ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేశారు.
![]() |
![]() |