హోళీ పండుగ నేపథ్యంలో ఓలా కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఓలాకు చెందిన పలు స్కూటర్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించినట్లు తెలిపింది. S1 Airపై రూ.26,750 వరకు, అలాగే S1 X+ (Gen 2)పై రూ.22,000 వరకు డిస్కౌంట్ అందజేయనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ మార్చి 13 నుంచి మార్చి 17న వరకు కొనుగోలు చేసే స్కూటర్లకు వర్తిస్తుందని తెలిపింది.మొత్తానికి సేల్‌లో భాగంగా ఓలా S1 ఎయిర్ (S1 Air) కొనుగోలుపై రూ.26,750 డిస్కౌంట్ రావడంతో రూ.89,999కి లభిస్తోంది. ఇక మరోవైపు ఓలా S1 X+ Gen 2 మోడల్‌పై ఏకంగా రూ.22,000 వరకు రాయితీ అందుతుండడంతో ఈ స్కూటర్ ధర రూ.82,999 నుంచి ప్రారంభం కానుంది. ఈ హోలీ ఫ్లాష్ సేల్ నిజంగా వినియోగదారులకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఒక మంచి అవకాశం. ఈ పరిమిత కాల ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవడానికి ఆసక్తిగల కొనుగోలుదారులు మార్చి 17లోపు ఓలా ఎలక్ట్రిక్ వెబ్‌సైట్ లేదా షోరూమ్‌లను సందర్శించి బుకింగ్ చేసుకోవచ్చు.
![]() |
![]() |