బొగోటా : కొలంబియాలో ప్రయాణికుల విమానం కూలి 12 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో తరారీయా, డోరిస్ గ్రామాల మేయర్, ఆయన కుటుంబ సభ్యులు కూడా మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. డగ్లస్ డీసీ-3 విమానం శాన్‌జోస్ డెల్ గౌవైరే, విల్లావిసెన్సియా పట్టణాల మధ్య అకస్మాత్తుగా కూలిపోయిందని అధికారులు చెప్పారు. కూలిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకుందని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. విమాన ఇంజిన్ వైఫల్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నప్పటికీ కొలంబియా పౌర విమానయాన సంస్థ మాత్రం కారణాలు వెల్లడించలేదు. విమానం ప్రయాణించిన సమయంలో ప్రతికూల వాతావరణం ఏమీ లేదని అధికారులు వివరించారు. విమాన ప్రమాదంలో ఎవరూ బతికి బయటపడలేదని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa