ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా: వాద్రా

national |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 02:14 PM

తాను త్వరలోనే రాజకీయ రంగంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయనేలా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రా ఇటీవల పలుసార్లు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పలుసార్లు ఫేస్‌బుక్‌ ద్వారా కూడా స్పందించారు. ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరిగింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆయనకు సంబంధించిన పోస్టర్లను కూడా ముద్రింపజేసి ప్రచారం చేస్తుండడంతో ఈ విషయంపై వాద్రా మరోసారి స్పందించారు. ఈ పోస్టర్లను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్ చేస్తూ కార్యకర్తలు చూపుతున్న అభిమానానికి హర్షం వ్యక్తం చేశారు. అతిపెద్ద వేదిక పై నుంచి తాను ప్రజలకు సేవచేయాలనుకుంటున్నానని, అయితే, తనపై ఉన్న అసత్య ఆరోపణలు తొలిగిపోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. తమ ప్రాంతం నుంచే నేను పోటీ చేయాలని కోరుతూ మన దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు నాపై చూపుతున్న ఆదరాభిమానాల పట్ల అమితానందం వ్యక్తం చేస్తున్నాను. మార్పు కోసం తమ ప్రాంతం నుంచే నేను ప్రాతినిధ్యం వహించాలని ప్రజలు భావిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో కలిసి పార్టీ ప్రచారంలో నేను అంకిత భావంతో పనిచేశాను. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa