రాజమండ్రి లోక్‌సభకు టీడీపీ టీడీపీ అభ్యర్థి ఎవరు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మాగంటి మురళీమోహన్ పోటీకి విముఖత వ్యక్తం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కానీ మురళీమోహన్ కోడలు రూపను పోటీకి పెట్టాల్సిందిగా పార్టీలో కొందరు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఆమె కొద్దిరోజులు రాజమహేంద్రవరంలో ఉండి కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. కానీ ఎంపీ మురళీమోహన్ కోడలను పోటీకి పెట్టడానికి కూడా సరేమిరా అని చెప్పినప్పటికీ కొంతమంది ఒత్తిడి పెంచారు. అయినా మురళీమోహన్ ఎటూ తేల్చలేదు.
తణుకు మునిసిపల్ మాజీ చైర్మన్ ముళ్లపూడి రేణుక టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆమె పార్టీకి తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆది, సోమవారాలలో ఆమె స్వయంగా ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నిస్తున్నారు. సుమారు 16 సంవత్సరాల నుంచి ఆమె తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. గతంలో ప్రధాన కార్యదర్శిగా, ప్రస్తుతం అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు ఒకటి, రెండు ఎంపీ స్థానాలైనా కేటాయిస్తే అందులో రాజమహేంద్రవరం కూడా ఉండవచ్చనే అంచనా ఉంది. గతంలో ఇక్కడ నుంచి మహిళలు ఎంపీలుగా ఎన్నికైన నేపథ్యం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు చోట్ల నుంచే మహిళలు ఎంపీ స్థానాలను ఆశిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి తోట సీతారామలక్ష్మి టిక్కెట్ ఆశిస్తుండగా, రాజమహేంద్రవరం నుంచి ముళ్లపూడి రేణుక ఆశిస్తున్నారు. మహిళలకు ఇస్తే మాగంటి రూప, ముళ్లపూడి రేణుకలలో ఒకరికి అవకాశం రావచ్చు.
ఇక వినిపిస్తున్న మరో రెండు పేర్లలో రివర్‌బే అధినేత జాస్తి మూర్తి, శశి అధినేత బూరుగుపల్లి గోపాలకృష్ణ. తనకు పార్టీ నుంచి ఫోన్ వస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు జాస్తి మూర్తి వర్గీయులు చెబుతున్నారు. స్వయంగా ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు. బలమైన అభ్యర్థిని పెట్టడం మంచిదన్న భావనలో ఉన్నారు కాబట్టి.. చివరికి మాగంటిరూపనే.. చంద్రబాబు ఖరారు చేస్తారని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa