ఒంగోలు భాగ్య నగరానికి చెందిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు పత్తిపాటి బాల బ్రహ్మచారి ఆదివారం అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలిసిన పలువురు సంఘ నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు.
బాల బ్రహ్మచారి మృతిపై ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాస చారి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన మరణం విశ్వబ్రాహ్మణ సంఘానికి తీరని లోటు అని చెప్పారు.
![]() |
![]() |