సైబర్ క్షేత్రాలుపరిశ్రమల్లోకి పెట్టుబడుల ప్రవాహం మొదలయ్యాక, క్రమంగా వలసలు కూడా రాష్ట్రం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఐదు వేల మంది ఏటా ఇంజనీరింగ్ పట్టభద్రులు ఉపాధి కోసం విశాఖపట్నం వస్తుండగా, వారిలో నైపుణ్యం ఉన్నవారికి ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు తమ వద్ద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ఇలాంటి పరిస్థితిని ఊహించడానికి ఉండేది కాదు. ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విదేశాల్లో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐతో చర్చించి విశాఖలో కంపెనీలు ఏర్పాటు చేయించింది. వారికి అవసరమైన భవనాలను సేకరించడానికి ‘డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కు’ స్కీములను ప్రారంభించింది. అందులో ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలను సమకూర్చింది. అద్దెలో 50 శాతం రాయితీ ప్రకటించింది. ఈ ప్రాంతంలో ఉపాధిలో కాస్త మెరుగ్గా విశాఖపట్నం ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని శ్రీకాకుళం, విజయనగరం నుంచి పనుల కోసం విశాఖకు వచ్చేవారికి మెరుగయిన అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు అనటంలో సందేహం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa