మాడగడ పంచాయతీ జాకరవలస, మెచ్చగూడ గ్రామాలకు రోడ్డు, మంచినీటి సమస్య పరిష్కరించాలని సీపీఎం మండల కార్యదర్శి కె. రామారావు డిమాండ్ చేశారు. మంగళవారం గ్రామస్తులతో కలిసి జాకరవలస నుంచి మాడగడ సచివాలయం-2 వరకు నీళ్ల బిందెలతో 3 కి.మీ పాదయాత్ర నిర్వహించారు. జన్మన్ ఇళ్ల నిర్మాణ ఖర్చును పెంచాలని కోరుతూ నిరసన తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామ సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa