ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం: ద్వివేది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 09:02 PM

సార్వత్రిక ఎన్నిక షెడ్యూల్ విడుదలతో అన్ని ఏర్పాట్లతో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన..రాష్ట్రంలో 3కోట్ల 82లక్షల 31వేల,026 ఓట్లు (3,82,31,026) ఉన్నాయి. నేటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది. రాజకీయ పార్టీల నేతలు, అధికారులకు వేర్వేరు కోడ్ రూల్స్ ఉన్నాయి. నిబంధనలు ఖచ్చితంగా అమల్లోకి ఉంటాయి. ఓటరు జాబితాలో ఓట్ల తొలగింపు సాధ్యం కాదు. లక్షన్నర ఫారం 7 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతిస్తేనే వాటిని తొలగిస్తాము.. లేకుంటే మార్కింగ్ చేస్తాము. ఓట్లు చేర్చడానికి మార్చి 15లోపు మాత్రమే స్వీకరిస్తాము. 25వ తేదీ నామినేషన్ చివరి తేదీ కాబట్టి .. 15లోపు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఓటరు జాబితాలో చేరడానికి మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది. 25మార్చి లోపు కొత్త ఓట్లను చేర్చడానికి అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 45,920 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి" అని ద్వివేది మీడియాకు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa