మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, వైద్య,ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సచివాలయంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రావణ్ కుమార్ పిల్లలకు పోలియో చుక్కలు వేసారు. 0-5 సంవత్సరాల పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ప్రజలను మంత్రి శ్రావణ్ కుమార్ కోరారు. ప్రతి ఒక్కరు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియోని తరిమి వేయలని, ఆంధ్రప్రదేశ్ ను పోలియో రహీత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నారు. మూడు రోజులపాటు (10 వ తేది నుండి 12 వరకు ) పోలియో కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంని, నాల్గవ రోజు 13వతేదిన విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి పట్టణ ప్రాంతాల్లో పోలియో చుక్కలు వేస్తున్నామన్నారు. బూత్ స్ధాయిని నుండి, ఇంటింటికి వెళ్లి ఎఎన్ఎమ్, ఆరోగ్య కార్యకర్తలు, టీచర్స్ , అంగన్ వాడీ వర్కర్స్, ఆశా కార్యకర్తలు పోలియో చుక్కలు వేస్తున్నట్లు మంత్రి శ్రావణ్ కుమార్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa