ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమయం లేదు మిత్రమా !-విజయం మనదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 09:11 PM

సమయం లేదు మిత్రమా! అయినా విజయం మనదే అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధైర్యాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో 150 అసెంబ్లీ స్థానాలు, 24 పార్లమెంటు స్థానాలు గెలిచి తీరతామని ప్రకటించారు. ఆదివారం నాడు మైలవరం మండల తెలుగుదేశం పార్టీ మరియు పొందుగల అనంతపురంలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో ను ప్రజలతోనూ పలు సభలలో ప్రసంగించారు. ఎన్నికల షెడ్యూలు వచ్చేసిందని ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికల అని తెలిపారు. ఎన్నికల నిబంధనలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తూచా తప్పనిసరిగా పాటించాలని  హితవు పలికారు. రానున్న ఎన్నికల్లో కోడి కత్తి పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని స్పష్టం చేశారు. ప్రతి తెలుగు కార్యకర్త విజయోత్సాహంతో పనిచేయాలని తెలుగుదేశం పార్టీ జెండాను విజయతీరాలకు నడిపించాలని పేర్కొన్నారు. పూరగుట్ట ఒక మహా పట్టణం కాబోతుందని, పొందుగల అనంతపురం గ్రామాల మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు రాబోతుందని చెప్పారు. మైలవరం నియోజకవర్గంలో వైకాపా నాయకులు ఎన్ని కుట్రలు చేసినా, అన్ని కుట్రలను భగ్నం చేసి అభివృద్ధి కార్యక్రమాలలో ప్రగతి పథంలో నడిపించినట్లు తెలిపారు. కనీవినీ ఎరుగని రీతిలో మైలవరం అభివృద్ధిని కళ్ళకు కనిపించేలా చేశామని, చేసిన పనులను సగర్వంగా చెప్పాలని,  చేయాల్సిన పనులను బాధ్యతగా తీసుకోవాలని మంత్రి ఉమా కార్యకర్తలకు హితవు పలికారు. ఓటర్ లిస్టులో పేరు ఉందో లేదో కూడా ప్రతి ఒక్క ఓటరు చెక్ చేసుకోవాలని, పేరు లేకపోతే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఐదోసారి మైలవరం ప్రజల ముందుకు వస్తున్నాని, కేసినేని నాని ని, ఎమ్మెల్యే గా నన్ను గెలిపించాల్సిందిగా కోరారు. నవ్యాంధ్ర పై మోదీ కేసీఆర్ జగన్ మూకుమ్మడిగా పగబట్టారని, వారి ముగ్గురకు ఓటర్లే ప్రజా తీర్పు తో బుద్ధి చెప్పాలని మంత్రి ఉమా పిలుపునిచ్చారు. పొందుగల అనంతవరం కార్యక్రమం సందర్భంగా రెండు గ్రామాల ప్రజలు మంత్రి ఉమా కు ఘనస్వాగతం పలికారు. హారతులు పట్టి బంతి పూల జల్లు తో, తీన్మార్ డప్పులతో గ్రామాలలో పండగ గా మార్చారు. వెయిట్ లిఫ్టర్ క్రీడాకారిణి డొంకిన అనూష మంత్రి దేవినేని ఉమ ను ప్రశంసిస్తూ అరుదైన నేత ఉమా అని పేర్కొన్నారు. ఇటీవల ఉమా ప్రోద్బలంతో అనూష 10 లక్షల రూపాయలు పారితోషకం ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే._






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa