నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ సీట్లలో సిట్టింగులకే గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది.. చిలకలూరిపేట నుంచి మంత్రి ప్రత్తిపాటి, గురజాల నుంచి యరపతినేని, వినుకొండలో జీవీ ఆంజనేయులు, పెదకూరపాడు నుంచి కొమ్మాలపాటి అభ్యర్థిత్వాలను ఖరారు చేయాలని పార్టీ నేతలంతా ఏక వాక్య తీర్మానాలు చేశారు.. దీంతో దాదాపుగా వారే ఖరారైనట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.. ఇక నరసరావు పేట నుంచి డాక్టర్ కోడెలకే అవకాశం ఇవ్వాలని ఆ నియోజకవర్గ నేతలు పట్టుబట్టినట్లు సమాచారం. సత్తెనపల్లి, మాచర్ల సీట్లపై స్పష్టత రావాల్సి ఉంది. నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలనే తిరిగి బరిలోకి దింపాలని తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చింది. చిలకలూరిపేట నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, గురజాల నుంచి యరపతినేని శ్రీనివాసరావు, వినుకొండ నుంచి జీవీ ఆంజనేయులు, పెదకూరపాడు నుంచి కొమ్మాలపాటి శ్రీధర్ తిరిగి పోటీ చేయనున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద జరిగిన సమీక్షలో తొలుత పార్టీ నియమించిన పరిశీలకులు అభిప్రాయ సేకరణ జరిపారు. ఈ నాలుగు నియోజకవర్గాలకు ఏకగీవ్రంగా తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు కేటాయించాలని నాయకులు ఏకవాక్య తీర్మానాలు చేశారు. మరోవైపు నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు ఇవ్వాలని పరిశీలకులను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa