ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నామని ఏపీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఎన్నికలు నవ్వాంధ్ర పౌరులకు ఆత్మగౌరవ పరీక్ష అని అన్నారు. మన ఆత్మగౌరవం దెబ్బతీసేలా ప్రతిపక్షాలు మాట్లాడాయన్నారు. ఏపీ లో లేని వాళ్లకు ఓటు అడిగే హక్కులేదన్నారు. ఐదేళ్లు అయినా వైసీపీ హైదరాబాద్ లోనే ఉందన్నారు. లోటస్ పాండ్ లో ఉండేవాళ్లు తెలంగాణలోనే పోటీ చేయాలన్నారు. ఐదేళ్లు నేను కష్టపడి పనిచేశాను, ఈ ఎన్నికలే నాకు పరీక్ష, ఈ రాష్ట్ర ప్రజలు ఓటేసి నన్ను పాస్ చేయాలని ఆయన కోరారు. ఏకపక్ష విభజన మూలంగా ఏపీ విపరీతంగా నష్టపోయిందన్నారు. నేను బస్సులో ప్రయాణించి అమరావతి వచ్చానని, అహర్నిషలు శ్రమించి అభివృద్ధి చేశానన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పసుపు కుంకుమ కార్యక్రమం ప్రవేశపెట్టామన్నారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.9 వేల సాయం చేశామని అన్నారు. ఏపీ విషయంలో తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల్లా ప్రవర్తించాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా సమర్థవంతంగా పనిచేశామన్నారు. పోలవరం ప్రాజెక్టు అడ్డుకునేందుకు తెలంగాణ నాయకులు ఎన్నో కేసులు వేయగా, వైసీపీ నేత జగన్ పరోక్షంగా సహకరించారన్నారు. గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తే అభ్యంతరమేమిటనీ అన్నారు.
వంద రిటర్న్ గిఫ్టులు ఇస్తా-
కేసీఆర్ ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తే నేను వంద రిటర్న్ గిఫ్టులు ఇస్తానని అన్నారు. టీడీపీ అనే పార్టీ లేకపోతే కేసీఆర్ అనే నాయకుడు ఎక్కడి వారన్నారు. ఏపీలో దొరల పాలన కావాలా అని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి నీళ్లు, మట్టి తీసుకువచ్చి ముఖాన కొడితే ఊరుకోవాలా అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.500 కోట్లు సహాయం చేస్తే నేను రాజధాని నిర్మించుకోవాలా అని ప్రశ్నించారు. ఆయన ఇస్తే నేను తీసుకోవాలా అని అడిగారు. మీరు వైసీపీ ని గెలిపిస్తే ఆ సీట్లను టీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంటారని, బీజేపీకి మద్దతిస్తారని అన్నారు. 25 ఎంపీ సీట్లు, 175 అసెంబ్లీ స్థానాలను గెలిపించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. చదువు, సంధ్యలేని నాయకుడు జగన్.. మోడీ, కేసీఆర్ కు ఊడిగం చేసేందుకేనన్నారు.
ఉద్యోగులు, ఫించన్ దారులు ఇలా ప్రతి ఒక్కరికి సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. టీడీపీని ఆశీర్వదించాలి. నాపై చేసే విమర్శల్లో ఎంత నిజం ఉందో ఆలోచించాలి. డేటా చోరీ ఎపిసోడులో కుట్రను ఎస్టాబ్లిష్ చేస్తే సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో టీడీపీ వ్యవస్ధలను నిర్వీర్యం చేసేందుకు డేటా చోరీ చేశారు. గతంలో జేబు దొంగలు ఉండేవారు.. ఇంటి దొంగలుండే వారు.. కానీ ఇప్పుడు ఓటు దొంగలు వచ్చారు. జగన్-మోడీ-కేసీఆర్ ముగ్గురూ కుమ్మక్కయ్యారు. రేపు ఢిల్లీకి వెళ్తున్నాం.. ఫారం-7 దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామన్నారు. 15వ తేదీ వరకు ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. జగన్ వంటి నేతలు చాలా మందిని జైళ్లకు తీసుకుపోతారు. హర్వార్డ్ యూనివర్శిటీలో ఆర్ధిక నేరాలు ఎలా జరుగుతాయోననే అంశానికి సంబంధించి జగన్ కేసులను కేస్ స్టడీగా చూపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa