ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పార్టీలు ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నాయి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 01:02 AM

టీడీపీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌ ఎపీలో ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. అధికార, ప్రతిపక్షపార్టీ నేత ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ, చట్టాన్ని అతిక్రమిస్తూ ఎన్నికల‌ను ప్రహసనంగా మారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల‌ సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో డేటా చోరీ, ఓటర్ల జాబితాలో పేర్ల తొల‌గింపు అంశాల‌పై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోందన్నారు. ఈ వ్యవహారాన్ని రెండు తెలుగు రాష్ట్రా ల మధ్య వివాదంగా మార్చేందుకు చంద్రబాబు, కేసీఆర్‌ ఇద్దరూ సమఉజ్జీులుగా ప్రయత్నాులు చేస్తుండడం సిగ్గుచేటైన విషయమని  ,. ఒకప్పుడు ఓటర్ల జాబితాల్లో పేర్లను చేర్చడం జరిగేదని, అందుకు భిన్నంగా తొలిసారిగా రాష్ట్ర చరిత్రలో ఓటర్ల తొల‌గింపు కార్యక్రమం కుట్రపూరితంగా జరుగుతోందనేది ప్రజల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందన్నారు.  ఇప్ప‌టికైనా ఈసి ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త ఇవ్వానిల‌ల‌ని డిమంమాండ్ చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa