రాబోయే ఎన్నికల్లో మహిళలకు అధిక ప్రాధ్యాన్యత ఇస్తామని, అలాగే యువత,బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు ఇస్తామని, జనరల్ స్థానాల్లో ఎస్సీ,ఎస్టీకు సీట్లు కేటాయిస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి వెల్లడించారు.. ఆదివారం జరిగినమహిళా కాంగ్రెస్ శిక్షణా శిబిరాన్ని సందర్శించిన ఆయనను ,తాము గత కొన్ని ఏళ్లుగా పార్టీని అంటిపెట్లుకుని ఉన్నామని, తమకు సీట్లు కేటాయించాలంటూ ఆయనను శిబిరంలోని మహిళందరూ అభ్యర్థించారు. సమావేశంలో ఉన్న వారిలో సగానికి పైగా మహిళలు తమకు సీట్లు కేటాయించాలని కోరటంతో ముగ్థుడైన రఘువీరా రెడ్డి ఇదే స్ఫూర్తితో ఎన్నికల్లో చావో,రేవో నని ఎన్నికల యుద్ధానికిసిద్ధం కావాలని మహిళకు పిలుపు నిచ్చారు. సీట్లుకావాలని దాదాపు 25 మందికి పైగా చేతులు ఎత్తగా వారికి భరోసా ఇస్తూ మహిళకు ఈసారి అధికంగా సీట్లు కేటాయిస్తామని తెలిపారు. మీకు రాహూల్ ప్రధాని కాగానే మహిళా రిజర్వేషన్ బ్లిు తీసుకు రావడం ద్వారా వచ్చే అసెంబ్లీలో మరిన్ని సీట్లు వస్తాయని ఆ.విశ్వాసనీయత దేశంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు.