టీటీడీ పాలక మండలి శుక్రవారం జూన్ నెల శ్రీవారి దర్శన టికె ట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవ టికెట్స్ విడుదల కానున్నాయి. 11 గంటలకు జేష్ఠాభిషేకం టికెట్స్ విడుదల కానున్నాయి. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్స్ విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింద
మార్చి 21న జ్యేష్టాభిషేకం టికెట్లు...
తిరుమలలో జూన్ 09 నుండి 11వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు టికెట్లను మార్చి 21న ఉదయం 11 గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు.
మార్చి 21న వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
మార్చి 22న అంగప్రదక్షిణం టోకెన్లు….
జూన్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
![]() |
![]() |