ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిక్కోలులో టీడీపీ బ్యాలెన్స్ క్లియర్..! అభ్యర్థులపై స్పష్టత..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 06:44 PM

శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీలో పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు టిక్కెట్లు ఖరారు చేశారు. పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి తెదేపా అభ్యర్థిగా సిట్టింగు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పేరునే అధిష్ఠానం ఖరారు చేసింది. జిల్లాలో నియోజకవర్గాల వారీ అభ్యర్థులతో శనివారం అర్ధరాత్రి వరకు తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో ఇతర అసెంబ్లీ స్థానాలతో పాటు పాతపట్నానికీ అధికారికంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
నియోజకవర్గంలోని మండలాల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలతో కూడా మరోసారి కూర్చొని మాట్లాడదామని సీఎం చెప్పారు.పాలకొండ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఆదివారం కూడా అధిష్ఠానం భారీగా కసరత్తు చేసింది. ఆదివారం మరోసారి ఎంపిక చేసిన నేతలు.. దాదాపుగా 50 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, వర్ల రామయ్య సహా అయిదుగురు సీనియర్‌ పరిశీలకులు.. పాలకొండ నియోజకవర్గంలోని నాయకులతో విడివిడిగా మాట్లాడారు. నాయకుల అభిప్రాయాలన్నింటినీ పరిశీలకులు చంద్రబాబు ముందుంచారు. పార్లమెంటు స్థాయిలోని అన్ని నియోజకవర్గాలతోనే ఇంతవరకు సమీక్షలు నిర్వహించి పంపించిన బాబు.. పాలకొండలో పొడచూపిన విభేదాల దృష్ట్యా.. నియోజకవర్గం నుంచి వెళ్లిన నాయకులు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. నిమ్మక జయకృష్ణ, నిమ్మక సుగ్రీవులు కుమార్తె స్వాతి, నిమ్మక పాండురంగలను.. వరుసగా పిలిపించుకుని ముఖాముఖి మాట్లాడారు. ఒకరి పేరునుఖరారు చేశారు. అందరినీ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే… ఇతర నియోజకవర్గాల్లో… పరిస్థితి… క్లియర్ అయిపోయింది. అభ్యర్థులందరూ క్లియర్ కావడంతో… వారు ప్రచార భేరీ మోగించారు. ఇంటింటికి ప్రచారం కొనసాగిస్తున్నారు.
చంద్రబాబు కూడా.. సిక్కోలు నుంచే ప్రచారం ప్రారంభిస్తూండటంతో… టీడీపీలో జోష్ కనిపిస్తోంది. వైసీపీలో మాత్రం ఇంత వరకూ.. అభ్యర్థులు ఖరారు కాలేదు. మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి చేరికతో… మొత్తం గందరగోళం ఏర్పడింది. ఎవరికి.. ఎక్కడ టిక్కెట్ ఇస్తారు.. ఏం చేస్తారో.. అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దాంతో .. వైసీపీ నేతలంతా సైలంటయ్యారు. ప్రచారం కూడా ప్రారంబించలేదు. జగన్ టిక్కెట్లు ఖరారు చేసిన తర్వాత ఖర్చులు పెట్టుకుందామని ప్రయత్నిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa